శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Jul 07, 2020 , 03:11:36

జీ4కు భయపడాల్సిన అవసరం లేదు

జీ4కు భయపడాల్సిన అవసరం లేదు

న్యూఢిల్లీ: చైనాలో ఇటీవల వెలుగు చూసిన కొత ్తరకం స్వైన్‌ ఫ్లూ వైరస్‌ జీ4 గురించి భయపడాల్సింది ఏమీ లేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ వైరస్‌ మనుషుల నుంచి మనుషులకు సోకింది అనడానికి ఎలాంటి ఆధారాలులేవని చెప్తున్నారు. పందుల పెంపకందారుల్లో ఈ వైరస్‌ సోకిన వారికి పరీక్షలు నిర్వహించగా ప్రాణాంతకమైంది కాదని తేలిందన్నారు. ఇది మరో మహమ్మారి అయ్యే అవకాశం ఉన్నదని వార్తలు వస్తున్న నేపథ్యంలో శాస్త్రవేత్తల ప్రకటన కాస్త ఊరటనిస్తున్నది. ఈ వైరస్‌ను 2011లోనే గుర్తించి, దాని వ్యాప్తిని గమనిస్తునట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే.