Bomb Threat | పాక్‌తో ఉద్రిక్తతల వేళ దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) ఆందోళన కలిగిస్తున్నాయి. పలు విమానాలకు, ఎయిర్‌పోర్ట్‌లకు, క్రికెట్ స్టేడియాలకు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా జైపూర్ క్రికెట్ స్టేడియానికి (Jaipur stadium) మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి.
జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియానికి (Sawai Mansingh Stadium) ఈరోజు బాంబు బెదిరింపులు వచ్చినట్లు అదనపు ఎస్పీ లలిత్ శర్మ తెలిపారు. స్పోర్ట్స్ కౌన్సిల్ అధికారిక ఈమెయిల్ ఐడీకి ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు చెప్పారు. ఈ మెయిల్‌తో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని స్టేడియాన్ని ఖాళీ చేయించారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ లలిత్ శర్మ వెల్లడించారు.
#WATCH | Rajasthan | A bomb threat mail was received at Sawai Mansingh Stadium in Jaipur today
Additional SP Lalit Sharma says, “The mail was sent to the official email ID of the Sports Council. Acting on this, the stadium was vacated. The Bomb Disposal Squad, with the help of… pic.twitter.com/pe0OYuEkLB
— ANI (@ANI) May 12, 2025
కాగా, మూడు రోజుల క్రితం అంటే మే8వ తేదీన కూడా జైపూర్ స్టేడియానికి ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావిస్తూ ఈ మెయిల్ పంపారు. స్టేడియంలో పేలుడు జరగవచ్చని హెచ్చరించారు. వీలైనంత వరకూ ప్రతి ఒక్కరినీ రక్షించుకోండి అంటూ దుండగులు ఆ మెయిల్లో పేర్కొన్నారు. ‘ఆపరేషన్ సిందూర్ విజయవంతానికి గుర్తుగా.. మేము మీ స్టేడియాన్ని బాంబులతో పేల్చేస్తాం. వీలైనంత వరకూ ప్రతి ఒక్కరినీ రక్షించుకోండి’ అంటూ పేర్కొన్నారు. బెదిరింపు మెయిల్‌తో అప్రమత్తమైన అధికారులు దర్యాప్తు చేపట్టారు. అంతకు ముందు ఈడెన్ గార్డెన్‌కు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈనెల 7న చండీగఢ్ నుంచి ముంబైకి వస్తున్న ఇండిగో (IndiGo) విమానాన్ని బాంబులతో పేల్చేస్తామంటూ ముంబై ఎయిర్‌పోర్ట్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. పాక్‌తో ఉద్రిక్తతల వేళ ఇలా వరుస బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి.
Also Read..
India-Pakistan | భారత్-పాక్ మధ్య కీలక చర్చలు వాయిదా..!
PM Modi | భారత్-పాక్ చర్చల వేళ.. అజిత్ దోవల్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ
ISRO | దేశ భద్రత కోసం 10 ఉపగ్రహాలు నిరంతరం పనిచేస్తున్నాయి : ఇస్రో చైర్మన్