కోల్కతా: పశ్చిమబెంగాల్లో 8 విడుతల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇవాళ ఏడో విడుత పోలింగ్ జరుగుతున్నది. ఈ సందర్భంగా మాల్దా నియోజకవర్గం భఖ్రా గ్రామంలోని పోలింగ్ బూత్ నెంబర్ 91లో రభస చోటుచేసుకుంది. బీజేపీ పోలింగ్ ఏజెంట్ శంకర్ సకార్ను తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బయటి గెంటేశారు.
తక్షణమే ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఈ ఘటనపై శంకర్ సకార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, సకార్ ఆరోపణలను తృణమూల్ కార్యకర్తలు కొట్టిపారేస్తున్నారు. శంకర్ సకార్ తమ పోలింగ్ బూత్ పరిధిలోని ఓటర్ కాదని, అందుకే తాము అతను ఏజెంట్గా కూర్చోవడానికి ఒప్పుకోలేదని చెప్పారు. కానీ, తాము అతడిని గెంటివేశామనడం అబద్దమని తెలిపారు.
#WATCH | WB: A BJP polling agent Sankar Sakar alleges he was forcefully pushed out of booth no.91 by TMC members and made to leave the spot in Bakhra village of Ratua, Malda. A TMC member says, "He is not a voter here so we asked him to leave respectfully. Nobody threatened him." pic.twitter.com/7JVcwahuGm
— ANI (@ANI) April 26, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
రైల్లో వచ్చిన ఆక్సిజన్ ట్యాంకర్లు.. వీడియో
పోలింగ్ ఏజెంట్ టోపీపై మమతాబెనర్జి బొమ్మ..!
ఒంట్లో వేడిని తగ్గించే ఈ చిట్కాలు మీకు తెలుసా..?
తెలంగాణలో 24 గంటల్లో 43 మంది మృతి
ప్రముఖ డైరెక్టర్ ఇంట విషాదం..!
ఎవరు ఈ చోలే జావో .. గూగుల్లో తెగ వెతికేస్తున్న నెటిజన్స్