ఒంట్లో వేడిని తగ్గించే ఈ చిట్కాలు మీకు తెలుసా..?
Health news: ఎండలవల్ల శరీర ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. దీనివల్ల ఒళ్లు అలసిపోయి నీరసం ఆవహిస్తుంది. కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా శరీర ఉష్ణోగ్రతలను తగ్గించుకోవచ్చు.

హైదరాబాద్: వేసవి కాలంలో సాధారణంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ ఎండలవల్ల శరీర ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనివల్ల ఒళ్లు అలసిపోయి నీరసం ఆవహిస్తుంది. మరి అలాంటి పరిస్థితి రావద్దంటే శరీర ఉష్ణోగ్రతలు పెరుగకుండా చూసుకోవాలి. కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా శరీర ఉష్ణోగ్రతలను తగ్గించుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో ఒకసారి చూద్దామా..?
- ప్రతి రోజూ క్రమం తప్పకుండా నిమ్మ రసం, కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా శరీరం చల్లబడుతుంది.
- రోజూ ఉదయం కొబ్బరి నూనె లేదా పొద్దు తిరుగుడు నూనెతో శరీరానికి మర్ధన చేసుకుని స్నానం చేయడంవల్ల కూడా శరీరం చల్లబడుతుంది.
- రోజూ రెండు కప్పులు తాటి బెల్లం కలిపిన నీళ్లను తాగడం ద్వారా కూడా శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు.
- అంతేగాక క్రమం తప్పకుండా ఎర్ర మందారం టీ తాగడంవల్ల కూడా శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
- కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగడం ద్వారా కూడా శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు.
- సోంపు, జీలకర్ర, ధనియాలు రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు తాగడంవల్ల కూడా ఒంట్లో వేడి తగ్గుతుంది.
- వేడిచేసే ఆహార పదార్థాలైన పుల్లటి పండ్లు, బీట్రూట్లు, క్యారెట్లను వేసవిలో ఎక్కువగా తినకూడదు.
- దానిమ్మ గింజల్లో శరీరంలో వేడిని తగ్గించే లక్షణం ఉంది. రెండుమూడు రోజులకు ఒకసారైనా దానిమ్మ గింజలు తినడం లేదా దానిమ్మ రసం తాగడంవల్ల శరీరం చల్లగా ఉంటుంది.
- మెంతులను వేయించి, పొడిచేసి గోరువెచ్చటి నీటితో కలిపి తాగడం ద్వారా కూడా వేడిని తగ్గించుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
మమతాజీ.. బెంగాలీలు ఎవరికీ భయపడరు: జేపీ నడ్డా
దేశాన్ని మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేసింది: ప్రధాని మోదీ
రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు : ఐఎండీ
కొవిడ్ హాస్పిటల్లో మంటలు.. 23 మంది రోగుల మృతి
సుప్రీం కోర్టు జడ్జి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూత
రాష్ట్రంలో కొత్తగా 8 వేల కరోనా కేసులు
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

