దేశాన్ని మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేసింది: ప్రధాని మోదీ
Mann Ki Baat: కరోనా మహమ్మారి దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆలిండియా రేడియోలో మట్లాడిన ప్రధాని.. దేశంలో కరోనా విలయ తాండవంపై స్పందించారు.

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆలిండియా రేడియోలో మట్లాడిన ప్రధాని.. దేశంలో కరోనా విలయ తాండవంపై స్పందించారు. కరోనా వైరస్ మన సహనాన్ని, నొప్పిని భరించే శక్తిని పరీక్షిస్తున్న సమయంలో తాను మీతో మాట్లాడుతున్నానని ప్రధాని పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి కారణంగా మన ప్రియ బాంధవులెందరో మనల్ని విడిచి వెళ్లిపోయారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా మొదటి వేవ్‌ను విజయవంతంగా అణిచివేసిన తర్వాత జాతి స్థైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగాయని, కానీ తుఫానుల విజృంభించిన సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ మహమ్మారిని అరికట్టడం కోసం తాను ఫార్మా పరిశ్రమ, ఆక్సిజన్ ఉత్పత్తి రంగాలకు చెందిన పలువురు నిపుణులు సమావేశమై చర్చించానని ప్రధాని చెప్పారు. ప్రస్తుతం మన హెల్త్‌కేర్ సిబ్బంది, డాక్టర్లు కరోనా మహమ్మారి ప్రధాన యుద్ధం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా చేస్తున్న పోరాటంలో కరోనా మహమ్మారి వారికి పలు విధాల అనుభవాలను మిగిల్చిందని చెప్పారు.
తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దు
కరోనా మహమ్మారికి సంబంధించి సోషల్ మీడియాలో కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, అలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలు అస్సలు నమ్మవద్దని ప్రధాని సూచించారు. నమ్మకమైన ప్రసార మాధ్యమాల నుంచి మాత్రమే ప్రజలు కరోనాకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలని కోరారు.
చాలా మంది వైద్యులు కూడా సోషల్ మీడియాలో కరోనా మహమ్మారికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నారని, కోరినవారికి ఉచితంగా సలహాలు, సూచనలు ఇస్తున్నారని ప్రధాని తెలిపారు. కరోనా మహమ్మారి కట్టడి కోసం రాష్ట్రాలు చేస్తున్న అన్ని రకాల ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని ఆయన చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు : ఐఎండీ
కొవిడ్ హాస్పిటల్లో మంటలు.. 23 మంది రోగుల మృతి
సుప్రీం కోర్టు జడ్జి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూత
రాష్ట్రంలో కొత్తగా 8 వేల కరోనా కేసులు
సుప్రీం కోర్టు జడ్జి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

