Food Poisoning | ఫుడ్ పాయిజన్ (Food Poisoning) కారణంగా సుమారు 80 మంది విద్యార్థులు అస్వస్థతకు (Students Fall Ill) గురయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని డియోరియా (Deoria) జిల్లాలో ఆదివారం చోటు చేసుకోగా.. తాజాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మోహరూనా గ్రామంలోగల పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆశ్రమ్ మెథడ్ ఇంటర్ కాలేజీ (Pandit Deendayal Upadhyay Ashram Method Inter College)లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి ఆహారం తిన్న సుమారు 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. దీంతో కళాశాల అధికారులు విద్యార్థులను మహర్షి దేవర్హ బాబా మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ దివ్య మిట్టల్‌తోపాటు ఎస్పీ ఆశ్రమ కాలేజీకి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. ఆశ్రమంలోని వంటశాలలో ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించారు. ఆహారాన్ని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. నివేదిక వచ్చిన వెంటనే.. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
Also Read..
Bangladesh Crisis | బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిర పరిస్థితులు.. పార్లమెంట్లో ప్రకటన చేయనున్న కేంద్రం