Bangladesh Crisis | పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్రరూపం దాల్చింది. దీంతో ప్రధాని పదవికి షేక్ హసీనా (Sheikh Hasina) రాజీనామా చేశారు. అనంతరం ఆర్మీ హెలికాప్టర్లో బంగ్లాదేశ్ మీదుగా భారత్ (India) చేరుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో హసీనా తాత్కాలిక ఆశ్రయం పొందుతున్నారు.
మరోవైపు పొరుగు దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితుల్ని కేంద్రం నిశితంగా గమనిస్తోంది. ఈ నేపథ్యంలో ఉదయం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి బంగ్లాలో నెలకొన్న పరిస్థితులపై అన్ని పార్టీల నేతలకు కేంద్రం వివరించింది. ఇక ఈ అంశంపై కేంద్రం పార్లమెంట్లో కూడా ప్రకటన చేయనుంది. బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) మధ్యాహ్నం 2:30 గంటలకు రాజ్యసభలో, మధ్యాహ్నం 3:30 గంటలకు లోక్‌సభ (Lok Sabha)లో సుమోటోగా ప్రకటన చేయనున్నారు (suo motu statement).
External Affairs Minister Dr S Jaishankar to make a suo motu statement in Rajya Sabha at 2.30 pm on the situation in Bangladesh pic.twitter.com/yCxt5fPQBf
— ANI (@ANI) August 6, 2024
ఉభయసభల్లో వాయిదా తీర్మానాలు..
మరోవైపు బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై చర్చించాలని కోరుతూ ఇవాళ ఉభయసభల్లోనూ వాయిదా తీర్మానా (Adjournment Motion)లు ఇచ్చారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా వాయిదా తీర్మానం ఇచ్చారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితిపై చర్చించాలని, ఆ దేశం వల్ల భారత్‌పై పడే ప్రభావం గురించి చర్చించాలని ఆయన తన వాయిదా తీర్మానంలో కోరారు. ఇక లోక్‌సభలోనూ ఇదే అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి ఈ తీర్మానం ప్రజెంట్ చేశారు.
Also Read..
Sheikh Hasina | మరికొన్ని రోజులు భారత్‌లోనే షేక్ హసీనా.. ఎందుకంటే..?