Indian Army | ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పొరుగుదేశం పాకిస్థాన్‌కు ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్ గట్టి బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ రక్షణకై అహర్నిశలు పోరాడుతున్న సైన్యానికి అన్ని వర్గాల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. ఉగ్రవాద నిర్మూలనకు ధైర్యంగా పోరాడుతున్న సాయుధ దళాలకు అండగా నిలిచేందుకు దేశ ప్రజలు ముందుకొస్తున్నారు. తమ వంతుసాయం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఉద్యోగులు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా ఓ ఎనిమిదేళ్ల చిన్నారి కూడా ఇండియన్ ఆర్మీ (Indian Army)కి తన వంతు సాయం చేసి అందరితో శెభాష్ అనిపించుకున్నాడు. తమిళనాడు (Tamil Nadu) కరూర్ జిల్లాకు చెందిన ఎనిమిదేళ్ల సాయి ధన్విష్ (Sai Dhanvish) రెండో తరగతి చదువుతున్నాడు. అయితే, పాక్‌తో విరోచితంగా పోరాడుతున్న మన సైన్యం కోసం ఆ చిన్నారి తన సేవింగ్స్‌ను విరాళంగా అందించాడు. కరూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తన తల్లిదండ్రులతో కలిసి వెళ్లాడు. తాను ఏడాదంతా కూడబెట్టిన డబ్బును వాటర్ ట్యాంక్ షేప్‌లో ఉన్న కిడ్డీ బ్యాంక్‌లో దాచి జిల్లా కలెక్టర్‌కు అందజేశాడు.
వెల్లియానైలో చేపల దుకాణం నడుపుతున్న సతీష్ కుమార్, పవిత్ర దంపతులకు సాయి ధన్విష్ జన్మించాడు. ఆ చిన్నారి ఇంత చిన్న వయసులోనూ అవసరంలో ఉన్న వారికి తనవంతు సాయం చేయడంలో ముందుంటాడు. గతంలో వయనాడ్ కొండచరియలు విరిగిపడిన సమయంలోనూ తనవంతు విరాళాలు ఇచ్చాడు. తన పుట్టినరోజు సందర్భంగా నిరాశ్రయులకు ఆహారం వంటివి పంపిణీ చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
Also Read..
Rajnath Singh | భుజ్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ను సందర్శించిన రాజ్‌నాథ్ సింగ్
Ceasefire | ఈనెల 18 వరకే కాల్పుల విరమణ : పాక్ మంత్రి ఇషాక్ దార్
Shehbaz Sharif: శాంతి కోసం భారత్‌తో చర్చలకు సిద్ధం : పాకిస్థాన్ ప్రధాని