Rajnath Singh | ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) విజయం నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) ఇవాళ గుజరాత్ పర్యటనకు వెళ్లారు. అక్కడ భుజ్‌లోని భారత వైమానిక దళం స్టేషన్ (Bhuj Air Force Station)ను సందర్శించారు. అక్కడ ఎయిర్ వారియర్స్ (Air Warriors)తో రాజ్‌నాథ్ సమావేశం కానున్నారు. ఇక ఈ పర్యటనలో రాజ్‌నాథ్‌తోపాటు ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కూడా ఉన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భుజ్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకున్న పాక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసేందుకు యత్నించిన విషయం తెలిసిందే. ఆ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పి కొట్టింది.
మరోవైపు రాజ్‌నాథ్ సింగ్ గురువారం జమ్ము కశ్మీర్లో పర్యటించిన విషయం తెలిసిందే. అక్కడ బలగాలతో ముచ్చటించారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంపై సైన్యాన్ని ప్రశంసించారు. సైనిక ఉన్నతాధికారులను కలిసి సరిహద్దు వద్ద ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. భారత్ సైన్యం కూల్చివేసిన పాక్ డ్రోన్లు, క్షిపణుల శకలాలను జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాలతో కలిసి పరిశీలించారు.
Also Read..
Ceasefire | ఈనెల 18 వరకే కాల్పుల విరమణ : పాక్ మంత్రి ఇషాక్ దార్
Covid Cases | మళ్లీ కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి.. ఆ దేశాల్లో హై అలర్ట్
James Comey | అధ్యక్షుడు ట్రంప్‌ను చంపేస్తా.. ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ పోస్ట్ వైరల్