James Comey | ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ (Ex FBI chief) జేమ్స్ కామీ (James Comey) సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ చర్చకు దారి తీస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ను చంపేస్తానంటూ (murder threat) అర్థం వచ్చేలా ఆయన ఓ పోస్ట్ పెట్టారు. ‘86 47’ అనే పదాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి ఆ తర్వాత డిలీట్ చేశారు. అయితే, అప్పటికే ఆ పోస్ట్ వైరల్ అయ్యింది. దీనిపై రిపబ్లికన్ పార్టీ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
జేమ్స్ కామీ పెట్టిన ‘86 47’ పదాలకు అర్థం ఏంటంటే..? ‘86’ అనే నంబర్‌ను సాధారణంగా ఎవరినైనా బహిష్కరించడానికి, హత్య చేయడానికి సీక్రెట్ కోడ్‌గా ఉపయోగిస్తుంటారు. 47 అనేది అమెరికా 47వ అధ్యక్షుడు ట్రంప్‌ను సూచించడానికి ఓ కోడ్‌గా పేర్కొంటున్నారు. జేమ్స్ కామీ పెట్టిన పోస్ట్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను చంపడం అని అర్థం వచ్చేదిలా ఉందని అధికారులు తెలిపారు. దీంతో అతడి చర్యలపై అమెరికా సీక్రెట్ సర్వీస్ సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ వెల్లడించారు.
అయితే, ఈ ఆరోపణలను జేమ్స్ కామీ ఖండించారు. తాను బీచ్‌వాక్ చేస్తున్న సమయంలో చూసిన షెల్ల చిత్రాన్ని పోస్ట్ చేశానని తెలిపారు. ఆ పోస్ట్‌ను అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ఆ నంబర్లను హత్యలు చేయడానికి ఉపయోగిస్తారనే విషయం తనకు తెలియదని స్పష్టంచేశారు. అమెరికా అధ్యక్షుడిని చంపాలనే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని చెప్పుకొచ్చారు.
Also Read..
Ceasefire | ఈనెల 18 వరకే కాల్పుల విరమణ : పాక్ మంత్రి ఇషాక్ దార్
Earthquake | తుర్కియే, చైనాను వణికించిన భూకంపం