Earthquake | చైనా (China)లో భూకంపం (Earthquake) సంభవించింది. యునాన్ ప్రావిన్స్ (Yunnan Region)లో శుక్రవారం ఉదయం 6:30 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు శుక్రవారం తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 4గా నమోదైనట్లు ఎన్సీఎస్ వెల్లడించింది.
గురువారం రాత్రి తుర్కియేలోనూ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. కొన్యా ప్రావిన్సులోని కులు జిల్లా కేంద్రానికి 14 కి.మీ దూరంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.2గా నమోదైంది. రాజధాని అంకారాతోపాటు సమీప నగరాల్లోనూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానిక మీడియా నివేదించింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భయంతో ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, నష్టానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు.
Also Read..
Shehbaz Sharif: శాంతి కోసం భారత్‌తో చర్చలకు సిద్ధం : పాకిస్థాన్ ప్రధాని
ఇజ్రాయెల్ దాడుల్లో 54 మంది మృతి