ఖాన్ యూనిస్: దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంపై బుధ-గురువారాల మధ్య రాత్రి ఇజ్రాయెల్ నిర్వహించిన దాడుల్లో 54 మంది మరణించారు. ఇజ్రాయెల్ దళాలు పెద్ద ఎత్తున బాంబులను కురిపించడం ఇది వరుసగా రెండో రోజు.
మృతుల్లో ఓ పాత్రికేయుని కుటుంబ సభ్యుల్లో 11 మంది కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇటీవల మాట్లాడుతూ, హమాస్ ఉగ్రవాద సంస్థను అంతం చేసే వరకు గాజా స్ట్రిప్‌లో యుద్ధం కొనసాగుతుందన్నారు.