Shehbaz Sharif: శాంతి కోసం భారత్‌తో చర్చలకు సిద్ధం : పాకిస్థాన్ ప్రధాని
Shehbaz Sharif : పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ .. భారత్‌తో చర్చలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. శాంతి స్థాపన కోసం భారత్‌తో చర్చలు నిర్వహిస్తామన్నారు. ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న కమ్రా ఎయిర్ బేస్‌ను విజిట్ చేసిన తర్వాత ఆయన మాట్లాడారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్(Shehbaz Sharif).. భారత్‌తో చర్చలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. శాంతి స్థాపన కోసం భారత్‌తో చర్చలు నిర్వహిస్తామన్నారు. ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న కమ్రా ఎయిర్ బేస్‌ను విజిట్ చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. అక్కడ ఉన్న సైనికులు, మిలిటరీ ఆఫీసర్లను ఆయన కలిశారు. శాంతి స్థాపన కోసం పాకిస్థాన్ సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. అయితే శాంతి చర్చల కోసం కశ్మీర్ సమస్యను షరుతుగా పెట్టారాయన.
కానీ భారత్ మాత్రం పాకిస్థాన్ షరతును తిరస్కరిస్తూనే ఉన్నది. జమ్మూకశ్మీర్, లడాఖ్‌లు తమ భూభాగాలని చెబుతూనే ఉన్నది. పాక్ ప్రధాని షెహబాజ్ పర్యటన సమయంలో.. ఆయనతో పాటు డిప్యూటీ ప్రధాని ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబిర్ సిద్దు ఉన్నారు.
ఇండియా, పాకిస్థాన్ మధ్య మే 10వ తేదీన కాల్పుల విమరణ ఒప్పందం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మే 6వ తేదీ రాత్రి ఇండియా ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పెహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయిన ఘటనకు ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ నిర్వహించారు. కమ్రా బేస్ కన్నా ముందు సియాల్కోట్లో ఉన్న పస్రూర్ కంటోన్మెంట్‌ను కూడా పాక్ ప్రధాని విజిట్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

