Himachal Floods | భారీ వర్షాల (Heavy Rains)కు హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) అల్లాడిపోతోంది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటలుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు మండి (Mandi) జిల్లాలోని బియాస్ నది (Beas River) ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తాజాగా మండి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి వరదలు పోటెత్తాయి. సంబల్ (Sambal) గ్రామంలో వరద ధాటికి ఏడుగురు వ్యక్తులు కొట్టుకుపోయారు. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వీడియోను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు ( Sukhvinder Singh Sukhu) ట్విట్టర్ లో పోస్టు చేశారు.
‘మండి జిల్లాలో ఈరోజు ఆకస్మిక వరదలకు ఏడుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ భయంకరమైన పరిస్థితిని పరిష్కరించడానికి ప్రస్తుతం చురుకైన రెస్క్యూ, సెర్చ్, రిలీఫ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి’ అని సీఎం పేర్కొన్నారు. అయితే సీఎం షేర్ చేసిన వీడియోలో వరద నీరు చాలా ఉద్ధృతంగా కిందకు ప్రవహిస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో మనుషులు కొట్టుకుపోతున్నది మాత్రం అస్పష్టంగా ఉంది. వీడియో తీసిన వ్యక్తి మాత్రం బాధాతత్వ హృదయంతో ‘ఓ గాడ్’ అంటూ పదేపదే అనడం వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ భయంకరమైన వీడియో వైరల్ అవుతోంది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆ రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలోనే 28 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఒక్కరోజే 16 మంది మరణించారు. గత రాత్రి సోలన్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. సోమవారం ఉదయం సిమ్లా నగరంలోని సమ్మర్ హిల్ ప్రాంతంలో గల శివాలయంపై కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది మృతి చెందారు.
Disturbing visuals have emerged from Sambhal, Pandoh – District Mandi, where, as reported, seven individuals have been swept away by flash floods today.
Active rescue, search, and relief operations are currently in progress to address this dreadful situation. pic.twitter.com/OLgZGgXNlF
— Sukhvinder Singh Sukhu (@SukhuSukhvinder) August 14, 2023
Also Read..
Shimla | శివాలయంపై విరిగిపడ్డ కొండచరియలు.. 9 మంది మృతి
Himachal Pradesh | భారీ వర్షాలకు అతలాకుతలమైన హిమాచల్.. 257 మంది మృతి, రూ.7 వేల కోట్ల నష్టం
Uttarakhand | భారీ వర్షాలకు పేకమేడలా కూలిన కళాశాల.. వీడియో