చండూరు, జనవరి 11: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం (బ్రహ్మంగారి గుడి) నూతన పాలకమండలిని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా నెల్లూరి శ్రీనివాసులు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నెల్లూరి శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. కమిటీ సభ్యులందరి సహకారంతో దేవస్థానాన్ని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడిపిస్తామని శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యుల పేర్లను వెల్లడించారు.
గౌరవ అధ్యక్షులు: ముంజంపల్లి వీరబ్రహ్మం, కోస్నాల్ మురళి, ఉపాధ్యక్షులు: రామగిరి సత్యం, సంకేజు సోమబ్రహ్మం
, కార్యదర్శి: సంకేజు భాస్కర్, దాసోజు వీరబ్రహ్మం, అంగోజు కిరణ్, కోశాధికారులు: వల్లగింజల వీరబ్రహ్మం, దాసోజు శ్రీను
, సాంస్కృతిక శాఖ: ముంజంపల్లి రాము, దాసోజు వెంకన్న, పోలేజు వీరప్ప కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కుల బాంధవులు, భక్తులు పాల్గొన్నారు.