తొగుట : జప్తిలింగారెడ్డి పల్లిలో వెలసిన సింగరాల మల్లన్న ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotta Prabhakar Reddy) ఆకాంక్షించారు. సింగరాల మల్లన్న దేవాలయంలో జరిగిన జాతర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దయతో ఈ సంవత్సరం పుష్కలంగా కాలమైందని, యాసంగిలో కూడా పెద్ద మొత్తంలో పంటలు పండి.. రైతులు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకున్నారు.
ఎల్లమ్మ దేవాలయంలోనూ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అభివృద్ధికి కృషి చేసిన దాతలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. సింగరాల మల్లన్న దేవాలయ నిర్మాణం ఎంతో ఆకట్టుకునే విధంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, సర్పంచ్లు బక్క కనకయ్య, పన్యాల ప్రవీణ్ రెడ్డి, ఉప సర్పంచ్ నూనె శ్యామల, నాయకులు చిలువేరు మల్లారెడ్డి, బండారు స్వామి గౌడ్, నంట పరమేశ్వర్ రెడ్డి, చంద స్వామి, తగరం అశోక్, సుభాష్ గౌడ్, బోయిని శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, కొండల్ రెడ్డి, దుబ్బాక కనకయ్య, భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.