Nandani Sharma : మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ నందని శర్మ(Nandani Sharma) హ్యాట్రిక్ నమోదు చేసింది. గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20వ ఓవర్లో వరుసగా మూడు వికెట్లు తీసి చరిత్రకెక్కింది. నాలుగో బంతికి కనికా ఆహుజాను వికెట్ కీపర్ లీ స్టంపౌట్ చేసింది. ఐదో బంతికి రాజేశ్వరీ గైక్వాడ్‌ను నందని బౌల్డ్ చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రేణుకా సింగ్‌ను బౌల్డ్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేసుకుంది. మొత్తంగా ఈ లీగ్ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన నాలుగో బౌలర్‌గా నందని అవతరించింది.
డబ్ల్యూపీఎల్‌లో నందని కంటే ముందు ఇసీ వాంగ్(ముంబై ఇండియన్స్), దీప్తి శర్మ(యూపీ వారియర్స్), గ్రేస్ హ్యారిస్(యూపీ వారియర్స్)లు హ్రాట్రిక్ వికెట్లు పడగొట్టారు. ఆరంభ సీజన్లో యూపీ వారియర్స్‌పై వాంగ్ వరుసగా మూడు వికెట్లు తీసింది. కిరన్ నవ్గరే, సిమ్రాన్ షేక్, సోఫీ ఎకిల్‌స్టోన్‌లను ఔట్ చేసింది.
🚨 𝐇𝐚𝐭-𝐭𝐫𝐢𝐜𝐤 𝐀𝐥𝐞𝐫𝐭 🚨
Nandni Sharma, you beauty 👌 #TATAWPL‘s 4th hat-trick 🫡
Updates ▶️ https://t.co/owLBJyAIzb #TATAWPL | #KhelEmotionKa | #DCvGG | @DelhiCapitals pic.twitter.com/Crnlx2PW5I
— Women’s Premier League (WPL) (@wplt20) January 11, 2026
రెండో సీజన్లో దీప్తి శర్మ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు మేగ్ లానింగ్, సథర్లాండ్, అరుంథతి రెడ్డిలను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించింది. యూపీ వారియర్స్ పేసర్ గ్రేస్ హ్యారిస్ సైతం ఢిల్లీపైనే ఈ రికార్డు నెలకొల్పింది. చిన్నస్వామి స్టేడియంలో నిక్కీ ప్రసాద్, చిన్నెలే హెన్రీ, మిన్ను మణిలను ఔట్ చేయడం ద్వారా హ్యాట్రిక్ నమోదు చేసింది.