3 AAP MPs Remain | ఆప్‌లో మిగిలిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు వీరే
3 AAP MPs Remain | ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీలు రెండుగా చీలిపోయారు. మొత్తం పది మంది ఎంపీల్లో ఏడుగురు సభ్యులు బీజేపీలో చేరుతున్నారు. దీంతో కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే ఆ పార్టీలో మిగిలారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీలు రెండుగా చీలిపోయారు. మొత్తం పది మంది ఎంపీల్లో ఏడుగురు సభ్యులు బీజేపీలో చేరుతున్నారు. (3 APP MPs Remain) దీంతో కేవలం ముగ్గురు ఎంపీలైన బల్బీర్ సింగ్ సీచేవాల్, సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తా మాత్రమే ఆప్‌లో మిగిలారు.
కాగా, తనతో పాటు మరో ఆరుగురు ఎంపీలు బీజేపీలో చేరేందుకు అంగీకరించినట్లు రాఘవ్ చద్దా శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆప్ రాజ్యసభ ఎంపీలైన స్వాతి మాలివాల్, హర్భజన్ సింగ్, రాజీందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీ, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ కూడా తనతో పాటు బీజేపీలో చేరుతున్నట్లు చెప్పారు.
మరోవైపు రాజ్యసభలోని ఆప్ బలంలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది మద్దతు తమకే ఉన్నదని రాఘవ్ చద్దా తెలిపారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతను నివారించడానికి ఈ ఏడుగురు ఆప్ ఎంపీలు బీజేపీలో విలీనం కానున్నట్లు తెలుస్తున్నది.
Also read:
Tejashwi Yadav | నితీశ్ కుమార్‌ను రాజకీయంగా బీజేపీ అంతం చేసింది: తేజస్వీ యాదవ్
Woman Stabs Lover’s Wife | ప్రియుడి ఇంటికి వెళ్లి.. అతడి భార్యను దారుణంగా చంపిన ప్రియురాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AAP
- Arvind Kejriwal
- MPs
- quit
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

