గురువారం 03 డిసెంబర్ 2020
National - Nov 04, 2020 , 21:57:39

ఢిల్లీలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 6,842 కేసులు

ఢిల్లీలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 6,842 కేసులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. ఒక్కరోజే రికార్డుస్థాయిలో సుమారు ఏడు వేల వరకు వైరస్‌ కేసులు వెలుగుచూశాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 6,842 కరోనా కేసులు, 51 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,09,938కు, మరణాల సంఖ్య 6,703కు పెరిగింది. గత 24 గంటల్లో 5,797 మంది కోలుకున్నారు. దీంతో ఢిల్లీలో కరోనా నుంచి కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య 3,65,866కు చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం 37,369 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. 

మరోవైపు ఢిల్లీలో మూడోసారి కరోనా విజృంభణ మొదలైందని, గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం తెలిపారు. పరిస్థితిని ప్రభుత్వం గమనిస్తున్నదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.