మా రాష్ట్రంలోనూ ఆక్సిజన్ కొరత.. సమస్యను పరిష్కరించిన ప్రభుత్వం
ఆక్సిజన్ కొరత| దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. దీంతో భారీ సంఖ్యలో బాధితులు హాస్పిటళ్లకు క్యూకడుతున్నారు. కరోనా తీవ్రతతో ఆక్సిజన్ అందకపోవడంతో దవాఖానల్లో చాలా మంది రోగులు మృతిచెందుతున్న విషయం తెలిసిందే.

ముంబై: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. దీంతో భారీ సంఖ్యలో బాధితులు హాస్పిటళ్లకు క్యూకడుతున్నారు. కరోనా తీవ్రతతో ఆక్సిజన్ అందకపోవడంతో దవాఖానల్లో చాలా మంది రోగులు మృతిచెందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ కొరతను పరిష్కరించడానికి.. ప్రాణవాయువు అవసరాలు, సరఫరాపై జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. దేశంలో ఆక్సిజన్ కొరత ఉండటంతోనే అత్యున్నత న్యాయస్థానం నేషనల్ టాస్క్ ఫోర్స్ (ఎన్టీఎఫ్)ను ఏర్పాటు చేసింది. ప్రాణవాయువు కొరత వల్ల ప్రజలు ప్రాణాలొదులుతున్నారు. మహారాష్ట్ర కూడా ఆక్సిజన్ కొరతను ఎదుర్కొన్నది. అయితే ఈ సమస్యను ప్రభుత్వం విజయంతంగా పరిష్కరించింది. ఎన్టీఎఫ్ చాలా కష్టపడాల్సి ఉంటుందని సంజయ్ రౌత్ చెప్పారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ దృష్ట్యా ఆక్సిజన్ కొరత ఏర్పడిన నేపథ్యంలో.. ప్రాణవాయువు అవసరాలు, సరఫరాపై జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు ఎన్టీఎఫ్ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా శాస్త్రీయంగా, హేతుబద్దతతో సమానంగా ఆక్సిజన్‌ను పంపిణీ చేయాల్సిన బాధ్యతను ఈ టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించింది.
ఇందులో బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెన్స్ వైస్ చాన్సలర్ డాక్టర్ భబతోష్ బిశ్వాస్, గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్ అండ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఎండీ డాక్టర్ నరేశ్ ట్రెహాన్, దిల్లీలోని గంగారామ్, తమిళనాడు రాయవెల్లూర్ క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, బెంగళూరులోని నారాయణ హెల్త్‌కేర్, ముంబయిలోని ఫోర్టిస్ ఆసుపత్రుల్లోని ప్రముఖ వైద్యులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తప్పుడు లెక్కలతోనే తీవ్ర ఇబ్బందుల్లో భారత్ : ఆటోని ఫౌసీ
రాష్ట్రంలో అమలులోకి వచ్చిన లాక్డౌన్
దేశంలో తగ్గుతున్న యాక్టివ్ కేసులు.. పెరుగుతున్న మరణాలు
బాదుడే బాదుడు.. మూడో రోజూ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
ఆక్సిజన్ అందక నాలుగు గంటల్లో 26 మంది మృతి
18 రాష్ట్రాలకు నేరుగా ‘కొవాగ్జిన్’ సరఫరా : భారత్ బయోటెక్
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
సెకండ్‌డోస్‌కు ప్రాధాన్యం!
ఆ జైలులో 56 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

