Bihar Elections | బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Elections) తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ప్రజలతో పాటూ ప్రముఖులూ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకూ 53.77 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
53.77% approximate voter turnout recorded in the first phase of #BiharElection2025, till 3 pm. pic.twitter.com/A2AHTjeHAi
— ANI (@ANI) November 6, 2025
బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి విడతలో భాగంగా 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాల్లో ఇవాళ (గురువారం) పోలింగ్ జరుగుతోంది. ఈ నెల 11న మిగితా 122 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది. ఈ నెల 14న ఫలితాలను వెల్లడించనున్నారు. తొలివిడతలో ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ 57 స్థానాల్లో పోటీ చేస్తుండగా, బీజేపీ 48 చోట్ల, ఎల్జేపీ 14, ఆర్ఎల్ఎం 2 స్థానాల్లో బరిలో ఉన్నది. ఇక మహాగఠ్ బంధన్ కూటమి నుంచి ఆర్జేడీ 73 చోట్ల, కాంగ్రెస్ నుంచి 24 మంది, సీపీఐ-ఎంఎల్ తరపున 14 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ సారథ్యంలోని జన్ సురాజ్ పార్టీ 119 మంది పోటీలో ఉన్నారు.
ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారిలో మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (రఘోపూర్), లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, జనశక్తి జనతాదళ్ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ (మహువా), ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి (తారాపూర్) ఉన్నారు.
Also Read..
Vijay Kumar Sinha | బుల్డోజర్లతో తొక్కిస్తాం.. ఎన్నికల వేళ బీహార్ ఉపముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు
Bus Accident | స్లీపర్ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు