అహ్మదాబాద్: తల్లి వెనుక నడుస్తున్న బాలుడిపై చిరుత దాడి చేసింది. నోటకరుచుకుని పొదల్లోకి ఎత్తుకెళ్లి చంపింది. ఈ సంఘటనతో గ్రామస్తులు భయాందోళన చెందారు. ఆ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. (Boy Mauled To Death By Leopard) గుజరాత్లోని అమ్రేలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో ధారి పట్టణంలోని గోపాల్గ్రామ్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ కుమారుడైన ఐదేళ్ల సాహిల్ కటారా తన తల్లి వెనుక నడిచి వెళ్తున్నాడు.
కాగా, పొదల్లో దాగిన చిరుత ఆ బాలుడిపై దాడి చేసింది. నోటకరుచుకుని ఈడ్చుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆ బాలుడ్ని గ్రామస్తులు గుర్తించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ సంఘటనతో గ్రామస్తులు భయాందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఆ చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అటవీ శాఖ అధికారి ప్రతాప్ చందు తెలిపారు.
Also Read:
Migrant Worker Lynched | బంగ్లా దేశీయుడిగా అనుమానించి.. వలస కార్మికుడిని కొట్టి చంపారు
Railways Hikes Fares | ఛార్జీలు పెంచిన రైల్వే.. డిసెంబర్ 26 నుంచి అమలు