తిరువనంతపురం: ఒక వలస కార్మికుడిని బంగ్లా దేశీయుడిగా అనుమానించారు. అతడు దొంగతనానికి పాల్పడినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Migrant Worker Lynched) కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాకు చెందిన 31 ఏళ్ల రామనారాయణ్ బాఘేల్ పని కోసం కేరళ వెళ్లాడు. వలయార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అట్టపల్లం ప్రాంతంలో అతడు నివసిస్తున్నాడు.
కాగా, డిసెంబర్ 17న రామనారాయణ్ దొంగతనానికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపించారు. అతడ్ని బంగ్లాదేశ్ జాతీయుడిగా అనుమానించారు. ‘నువ్వు బంగ్లాదేశీ’ కదా అంటూ దారుణంగా కొట్టారు. ఈ నేపథ్యంలో తీవ్ర గాయాల వల్ల రక్తస్రావంతో అతడు మరణించాడు.
మరోవైపు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రామనారాయణ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి శరీరంపై 80కు పైగా గాయాలున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆ వ్యక్తిని దారుణంగా కొట్టడంతో చనిపోయినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో నిర్ధారించారు.
కాగా, ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తిపై దాడికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Migrant worker lynched to death in Kerala over false theft charge… autopsy reveals over 80 injuries.
A 31-year-old worker from Chhattisgarh, Ramnarayan Bhayar, was beaten to death by locals in Kerala’s Palakkad district.
Attackers questioned him: “Are you Bangladeshi?” and… pic.twitter.com/dQtKcGjiNW
— زماں (@Delhiite_) December 19, 2025
Also Read:
Railways Hikes Fares | ఛార్జీలు పెంచిన రైల్వే.. డిసెంబర్ 26 నుంచి అమలు
differently-abled Boy Thrashed | దివ్యాంగ బాలుడ్ని కొట్టి.. కంట్లో కారం చల్లిన స్కూల్ నిర్వాహకులు