సిమ్లా: ఐదంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. (building collapses ) ఆ భవనం సమీపంలోని రహదారి పాక్షికంగా దెబ్బతిన్నది. సమీపంలోని మరో బిల్డింగ్ కూడా పగుళ్లిచ్చింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హిమాచల్ ప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. సిమ్లా సమీపంలోని ఘండాల్ గ్రామంలో జాతీయ రహదారి 205 పక్కన ఉన్న ఐదు అంతస్తుల భవనం శనివారం కుప్పకూలింది. భవనం కూలిపోవడంతో ప్రభుత్వ కాలేజీకి వెళ్లే రోడ్డు ధ్వంసమైంది. ఈ సంఘటన వల్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
కాగా, ధామిలో తవ్వకం పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బిల్డింగ్ పక్కనే ఉన్న రహదారిలో పగుళ్లు ఏర్పడ్డాయి. అలాగే ధామిలోని డిగ్రీ కళాశాల సమీపంలోని బిల్డింగ్ కూడా పగుళ్లిచ్చింది. దీంతో అందులో ఉంటున్న లా కాలేజీ విద్యార్థులను వారం రోజుల కిందట ఖాళీ చేయించారు. ఆ భవనానికి విద్యుత్ కనెక్షన్లు కూడా తొలగించారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆ బిల్డింగ్ కూలిపోయింది. ముందస్తు చర్యల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Breaking: Major landslide in Shimla, where a 5-story building collapsed, and cracks appeared in the adjoining area and buildings. No casualties reported till now. #Shimla #Himachal pic.twitter.com/hRVXPY45Km
— Gagandeep Singh (@Gagan4344) January 20, 2024