Akhik Akkeneni | 2025వ సంవత్సరం మరో 18 రోజుల్లో ముగియబోతుంది. అయితే ఈ ఏడాది సినీ, క్రీడా, టెలివిజన్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తమ బ్యాచిలర్ లైఫ్‌కి శుభం కార్డు పలుకుతూ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కొందరూ ప్రేమ వివాహంతో ఒక్కటవ్వగా మరికొందరూ పెద్దలు కుదిర్చిన వివాహంతో ఒక్కటయ్యారు. అయితే ఈ ఏడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ప్రముఖ జంటలను ఒకసారి చూసుకుంటే.
అఖిల్ అక్కినేని – జైనబ్

Akhil Zainab
అక్కినేని వారసుడు కింగ్ నాగార్జున చిన్న కుమారుడు, హీరో అఖిల్ అక్కినేని ఈ ఏడాది పెళ్లి చేసుకున్నాడు. గతేడాది అన్న నాగచైతన్య వివాహం జరుగగా.. ఈ ఏడాది తమ్ముడు అఖిల్, జైనబ్‌తో ఏడడుగులు వేశాడు. వీరి వివాహం జూన్ 6న అంగరంగ వైభవంగా జరిగింది.
సమంత – రాజ్ నిడిమోరు

Samanatha – raj
హీరోయిన్ సమంత, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుల ప్రేమాయణం గురించి చాలా కాలంగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరూ తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా, డిసెంబర్ 1న తమిళనాడులోని కోయంబత్తూరులో గల ఈషా యోగా సెంటర్లో భూతశుద్ధి వివాహం చేసుకుని అందరికీ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం విశేషం.
అవికా గోర్ – మిలింద్ చంద్వానీ

Avika Gor
‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అవికా గోర్, నిజ జీవితంలోనూ పెళ్లికూతురుగా మారింది. సెప్టెంబర్ 30న ఒక రియాలిటీ షోలో ఆమె ప్రియుడు మిలింద్ చంద్వానీని వివాహం చేసుకుంది.
అర్చన కొట్టిగె – బీఆర్ శరత్

Archana Kottige
కన్నడ నటి అర్చన కొట్టిగె, క్రికెటర్ బీఆర్ శరత్ ఏప్రిల్ 23న బెంగళూరులో వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
ఆశ్లేష సావంత్ – సందీప్ బస్వానా

Ashesha Sawant Wedding
23 ఏళ్లుగా ప్రేమబంధంలో ఉన్న ఈ టీవీ నటుల జంట చివరకు ఒక్కటైంది. ఇటీవల కృష్ణుడి గుడికి వెళ్లినప్పుడు పెళ్లి చేసుకోవాలనే కోరిక కలగడంతో, నవంబర్ 23న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.
హీనా ఖాన్ – రాకీ జైస్వాల్

Hina Khan
బుల్లితెర నటి హీనా ఖాన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న కష్టసమయంలోనూ ఆమె చేయిని వదలకుండా పట్టుకున్న ప్రియుడు రాకీ జైస్వాల్‌ను జూన్ 4న వివాహం చేసుకుంది.
అభిషన్ జీవింత్ – అఖిల

Abhishan Jeevinantha
‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో దర్శకుడిగా విజయం సాధించిన అభిషన్ జీవింత్, తన ప్రియురాలు అఖిలను అక్టోబర్ 31న ఒక సినిమా ఈవెంట్లో ప్రపోజ్ చేసి, అదే రోజున మూడు ముళ్లు వేశాడు.
అర్మాన్ మాలిక్ – ఆష్నా ష్రాఫ్

Armaan Malik
ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆష్నా ష్రాఫ్‌ను జనవరి 2న గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నాడు. వీరితో పాటు, సారా ఖాన్ – క్రిష్ పాఠక్, సెలీనా గోమెజ్ – బెన్నీ బ్లాన్కో, దర్శన్ రావల్ – దరల్ సురేలియా, ప్రతీక్ బాబర్ – ప్రియా బెనర్జీ, ఆదార్ జైన్ – అలేఖ అద్వానీ, ప్రజక్త కోహ్లి – వృషాంక్ ఖనాల్ వంటి పలువురు జంటలు కూడా ఈ ఏడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.