Arrest | పాకిస్థాన్‌కు కీలక సమాచారం.. రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్
Arrest | పాకిస్థాన్ (Pakistan) గూఢచర్య నెట్‌వర్క్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై భారత వైమానిక దళాని (Indian Airforce) కి చెందిన ఒక రిటైర్డ్ అధికారిని అసోం పోలీసులు (Assam police) అరెస్ట్ చేశారు.
Arrest : పాకిస్థాన్ (Pakistan) గూఢచర్య నెట్‌వర్క్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై భారత వైమానిక దళాని (Indian Airforce) కి చెందిన ఒక రిటైర్డ్ అధికారిని అసోం పోలీసులు (Assam police) అరెస్ట్ చేశారు. తేజ్‌పూర్‌లోని పాటియా ప్రాంతానికి చెందిన కులేంద్ర శర్మ (Kulendra Sharma) .. దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు శుక్రవారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
కొంతకాలంగా కులేంద్ర శర్మపై నిఘా పెట్టిన పోలీసులు, ప్రాథమిక విచారణ అనంతరం అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు పాకిస్థాన్ గూఢచర్య సంస్థతో సంబంధాలున్న వ్యక్తులతో టచ్‌లో ఉంటూ, వారికి దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతని మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకోగా.. అందులో కొన్ని అనుమానాస్పద ఆధారాలు లభించినట్లు సమాచారం. అందులోని కొంత డేటాను నిందితుడు డిలీట్ చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలిసింది.
నిందితుడు శర్మకు పాక్‌తో సంబంధాలున్నాయనే అనుమానాలు బలంగా ఉన్నాయని, అయినప్పటికీ దర్యాప్తు పూర్తయితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సోనిత్పూర్ డీఎస్పీ హరిచరణ్ భూమిజ్ చెప్పారు. కులేంద్ర శర్మ 2002లో పదవీ విరమణ పొందారు. అంతకుముందు సుఖోయ్ 30 యుద్ధ విమానాల స్క్వాడ్రన్ వంటి కీలక వనరులున్న తేజ్‌పూర్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో జూనియర్ వారెంట్ ఆఫీసర్‌గా పనిచేశారు. రిటైర్మెంట్ తర్వాత కొన్నాళ్లు తేజ్‌పూర్ యూనివర్సిటీలో కూడా విధులు నిర్వర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

