కోల్కతా: కోల్కతాలో ఫుట్బాల్ ప్లేయర్ మెస్సి ఎగ్జిబిషన్ మ్యాచ్లో ఆడకపోవడంతో సాల్ట్ లేక్ స్టేడియంలో అభిమానులు విధ్వంసం సృష్టించిన విసయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోల్కతా పోలీసులు(Kolkata Police) ఇవాళ ఆ ఈవెంట్ ఆర్గనైజర్ సతాద్రు దత్తను అరెస్టు చేశారు. ఆకస్మికంగా మెస్సీని స్టేడియం నుంచి తీసుకెళ్లడంతో ప్రేక్షకులు వీరంగం సృష్టించారు. ఎయిర్పోర్టులో సతాద్రు దత్తను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర స్థాయిలో ప్రాపర్టీకి నష్టం జరిగింది.
పలు రకాల సెక్షన్ల కింద నిర్వాహకుడిపై కేసు పెట్టనున్నారు. త్వరలో ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు కోల్కతా పోలీసులు వెల్లడించారు. లీగల్ చర్యలు తీసుకుంటామని శాంతిభద్రతల అదనపు డీజీ జావెద్ షామిమ్ తెలిపారు. అభిమానుల్ని విస్మరించడం పట్ల ఆరా తీస్తామని, ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకుని చర్యలు తీసుకుంటామన్నారు.
కోల్కతా ఘటనను సుమోటోగా స్వీకరించిన కేసును నమోదు చేయనున్నట్లు కోల్కతా పోలీసులు తెలిపారు. ప్రేక్షకుల టికెట్ డబ్బును రిఫండ్ చేయాలని నిర్వాహకులకు పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి మేనేజ్మెంట్ను సహించబోమని కోల్కతా పోలీసు కమీషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.