చండీగఢ్: బాణసంచా కర్మాగారంలో పేలుడు జరిగింది. (firecracker factory blast) పేలుడు ధాటికి రెండస్తుల బిల్డింగ్ కూలిపోయింది. ఈ సంఘటనలో ఐదుగురు వలస కూలీలు మరణించారు. సుమారు 30 మంది గాయపడ్డారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. పంజాబ్‌లోని శ్రీ ముక్త్సర్ సాహిబ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సింగ్వాలా గ్రామ శివార్లలో ఉన్న క్రాకర్స్ తయారీ, ప్యాకేజింగ్ యూనిట్లో పేలుడు జరిగింది. పేలుడు తీవ్రత వల్ల రెండు అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ సంఘటనలో ఐదుగురు వలస కూలీలు మరణించారు. సుమారు 30 మంది కూలీలు గాయపడ్డారు.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. తార్సేమ్ సింగ్‌కు చెందిన బాణసంచా కర్మాగారంలో పేలుడు జరిగిందని లాంబి డీఎస్పీ జస్పాల్ సింగ్ తెలిపారు. పేలుడు వెనుక గల కారణం గురించి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. క్రాకర్స్ ఫ్యాక్టరీలో పని చేసే కార్మికుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, బీహార్‌కు చెందినవారని అన్నారు. మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
#WATCH | Punjab | 4 killed and more than 20 injured in a blast at firecracker factory in Sri Muktsar Sahib, late last night.
(Source: SSP Pro) pic.twitter.com/sEgTnIx7xQ
— ANI (@ANI) May 30, 2025
Read More: