lightning strikes | దేశంలో వరుస పిడుగుపాటు (lightning strikes) మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మూడు రోజుల క్రితం బీహార్‌లో పిడుగుపాటు కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బుధవారం ఉత్తరప్రదేశ్‌లో 38 మంది చనిపోయారు. ఇప్పుడు మరోసారి బీహార్ (Bihar) రాష్ట్రంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. సుమారు 18 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మధుబని జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ మరణాలు నమోదయ్యాయి. ముందుగా ఫుల్పరాస్ బ్లాక్ పరిధిలోని బత్నాహా గ్రామంలో అర డజనుకుపైగా ప్రజలు వ్యవసాయ పొలాల్లో పనులు చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా పిడిగుపడింది. దీంతో మకున్ సూఫీ, అషినా ఖాతూన్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా.. మరో బాధితుడు ఖుతౌనా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో ఘటన బాబుబర్హి బ్లాక్ పరిధిలోని దుమారియా గ్రామంలో చోటు చేసుకుంది. అక్కడ సంగీతా దేవి, మంజు దేవి పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ మేరకు మరణించిన ప్రతి బాధిత కుటుంబానికి రూ.4లక్షల పరిహారం ప్రకటించారు.
18 మంది విద్యార్థులకు గాయాలు..
మరో ప్రాంతంలో పిడుగు పడిన ఘటనలో 18 మంది విద్యార్థులు (Students Injured) గాయాలపాయల్యారు. తరారీ బ్లాక్ పరిధిలోని బర్కా గావ్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన విద్యార్థులు సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. గాయపడిన విద్యార్థులు నిషా కుమారి, ప్రియా కుమారి, సగుఫ్తా, ప్రియాంషు కుమారి, సంగీత కుమారి, రీటా కుమారి, ముస్కాన్ కుమారి, మధు కుమారి, నేహా కుమారి, రుక్సానా ఖాటూన్, అంజు కుమారి, కిస్నే కుమారి, అనీషా కుమారి, ముస్కాన్ కుమారి, అమృత కుమారి, శాంతి కుమారిగా గుర్తించారు.
Also Read..
Joe Biden | కమలా హ్యారిస్‌కు బదులు యూఎస్ ఉపాధ్యక్షుడు ట్రంప్ అంటూ నోరుజారిన బైడెన్
Nepal | బస్సులు నదిలో కొట్టుకుపోయిన ఘటనలో.. ఏడుగురు భారతీయులు మృతి