అహ్మదాబాద్ : భారీ వర్షాలు (Heavy Rains) ఉత్తరాదిని వణికిస్తుండటంతో పలు రాష్ట్రాల్లో వరద ముప్పు పొంచిఉంది. గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో ఓ చెరువు వద్ద 5 అడుగుల పొడవైన మొసలి కనిపించడంతో స్ధానికులు భయాందోళనకు లోనయ్యారు.
మొసలిని చూసిన స్ధానికులు గ్రామ పెద్దకు తెలియచేయడంతో ఆయన అంక్లావ్ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అంక్లావ్ అటవీ శాఖాధికారులు, విద్యానగర్ నేచర్ హెల్ప్ ఫౌండేషన్ సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకుని వన్యప్రాణిని కాపాడారు. మొసలిని పట్టుకున్న సిబ్బంది ఆపై దాన్ని నిర్జన ప్రదేశంలో విడిచిపెట్టారు.
భారీ వర్షాల కారణంగా నదుల్లో నీటి ప్రవాహం పెరిగినందున మొసళ్లు కనిపిస్తున్నాయని నేచర్ హెల్ప్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ రాహుల్ సోలంకి వెల్లడించారు. మొసలి కనిపించిన ప్రదేశానికి తమ బృందం సకాలంలో రావడంతో మొసలిని కాపాడగలిగామని చెప్పారు.
Read More :