Road Accident | హర్యానా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) సంభవించింది. మహీంద్రా థార్ (Thar) కారు అదుపుతప్పి గురుగ్రామ్ (Gurugram)లోని జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరుగురు వ్యక్తులు (ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు) ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) నుంచి గురుగ్రామ్‌కు థార్ కారులో వెళ్తున్నారు. శనివారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం హైవే ఎగ్జిట్ నంబర్ 9 సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ ఇద్దరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదంలో థార్ కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
వాంగ్‌చుక్ అరెస్ట్.. జాతీయ భద్రతా చట్టం కింద అదుపులోకి తీసుకున్న పోలీసులు
MiG-21 | ముగిసిన మిగ్-21 శకం.. చండీగఢ్‌లో తుది వీడ్కోలు
EPFO | తప్పుడు కారణాలతో విత్‌డ్రా చేస్తే రికవరీ తప్పుదు