MiG-21 | ముగిసిన మిగ్-21 శకం.. చండీగఢ్‌లో తుది వీడ్కోలు
MiG-21 | భారత వైమానిక దళంలో సుదీర్ఘ కాలం(62 ఏండ్లు) సేవలందించిన మిగ్-21 విమానాల శకం శుక్రవారం ముగిసింది. చంఢీగఢ్‌లో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మిగ్-21 బైసన్‌ను చివరిసారిగా నడిపారు.
- 62 ఏండ్లు విశిష్ట సేవలు
MiG-21 | చండీగఢ్: భారత వైమానిక దళంలో సుదీర్ఘ కాలం(62 ఏండ్లు) సేవలందించిన మిగ్-21 విమానాల శకం శుక్రవారం ముగిసింది. చంఢీగఢ్‌లో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మిగ్-21 బైసన్‌ను చివరిసారిగా నడిపారు. ప్రియా శర్మ మిగ్‌ను నడిపిన చివరి మహిళా పైలట్‌గా నిలిచారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్, సీడీఎస్ అనిల్ చౌహాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాంథర్స్గా పిలిచే మిగ్-21 జెట్స్ ల్యాండింగ్ సందర్భంగా జల ఫిరంగులతో వందనం చేశారు. 1966-1980 మధ్య కాలంలో భారత్ వివిధ మోడళ్లలోని 872 మిగ్ విమానాలను కొనుగోలు చేసింది.
పాకిస్థాన్‌తో 1965, 1977, 1999లో జరిగిన యుద్ధాల్లో, 2019లో జరిగిన బాలాకోట్ గగనతల దాడుల్లో ఈ విమానాలు కీలకపాత్ర పోషించాయి. ‘ఆరు దశాబ్దాల పాటు సేవలు, లెక్కలేనన్ని సాహస గాథలు, దేశ గౌరవాన్ని ఆకాశంలో రెపరెపలాడించిన యుద్ధ గుర్రం’ అంటూ ఐఏఏఫ్ ఎక్స్‌లో మిగ్-21 సేవలను ప్రశంసించింది. అయితే ఈ విమానాల సుదీర్ఘ సేవా చరిత్ర అనేక ప్రమాదాల వల్ల దెబ్బతింది. ఈ పాత కాలం నాటి విమానాల భద్రతపై ఇటీవలి దశాబ్దాలలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

