Lok Sabha Elections | మధ్యాహ్నం 3 గంటల వరకూ 49.2 శాతం మేర పోలింగ్
Lok Sabha Elections | లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections 2024) ఆరో విడత (6th phase) పోలింగ్ శనివారం ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ 49.2 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Lok Sabha Elections | లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections 2024) ఆరో విడత (6th phase) పోలింగ్ శనివారం ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 58 లోక్‌సభ నియోజకవర్గాలకు జరుగుతున్న ఈ పోలింగ్‌లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకూ 49.2 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా ప్రకారం.. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 70.19 శాతం మేర పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత జార్ఖండ్‌లో 54.34 శాతం, బీహార్‌లో 45.21 శాతం, హర్యానాలో 46.26 శాతం, జమ్మూ కశ్మీర్లో 44.41 శాతం, ఢిల్లీలో 44.58 శాతం, ఒడిశాలో 48.44 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 43.95 శాతం మేర పోలింగ్ నమోదైంది.
ఇవాళ ఆరో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌తోపాటే ఒడిశా అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ కూడా జరుగుతున్నది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలున్న ఒడిశాలో తొలి రెండు దశల్లో 105 స్థానాలకు పోలింగ్ జరగ్గా మిగిలిన 42 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా జార్ఖండ్‌లోని గండీ అసెంబ్లీ స్థానానికి కూడా ఇవాళే ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. గండి నుంచి జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ జేఎంఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
#LokSabhaElections2024 | 49.2% voter turnout recorded till 3 pm, in the 6th phase of elections.
Bihar- 45.21%
Haryana- 46.26%
Jammu & Kashmir- 44.41%
Jharkhand- 54.34%
Delhi- 44.58%
Odisha- 48.44%
Uttar Pradesh-43.95%
West Bengal- 70.19% pic.twitter.com/CnEFFL3nUt— ANI (@ANI) May 25, 2024
Also Read..
Weather Report | మరిన్ని ప్రాంతాలకు విస్తరించిన రైతుపవనాలు..!
Hardhik Pandya | భార్యతో విడాకులు.. 70 శాతం సంపద పోయినట్టేనా..?
CEC Rajiv Kumar | సందేహాల వాతావరణాన్ని సృష్టించే యత్నం.. పోలింగ్ డేటా వివాదంపై సీఈసీ రాజీవ్ కుమార్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

