Hardhik Pandya | భార్యతో విడాకులు.. 70 శాతం సంపద పోయినట్టేనా..?
Hardhik Pandya : భారత జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya)కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. ముంబై ఇండియన్స్(Mumbai Indians) సారథిగా విఫలమైన పాండ్యా ఇప్పుడు భార్య నటాషా స్టాంకోవిక్ (Natasha Stankovic)తో విడిపోనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
Hardhik Pandya : భారత జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya)కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. మైదానంలోనే కాదు వైవాహిక జీవితంలో సైతం ఆ ఆల్రౌండర్ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) సారథిగా విఫలమైన పాండ్యా ఇప్పుడు భార్య నటాషా స్టాంకోవిక్(Natasha Stankovic)తో విడిపోనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే డైవర్స్ సెటిల్మెంట్ కింద పాండ్యా తన సంపాదనలో సగానికి పైగా సమర్పించుకోనున్నాడు. అవును.. పాండ్యా 70 శాతం సంపద కోల్పోయే చాన్స్ ఉంది.
అసలేం జరిగిందంటే.. ఈ మధ్యే నటాషా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పాండ్యా పేరును తొలిగించింది. అంతేకాదు ‘ఒకరు త్వరలోనే వీధుల్లోకి రానున్నారు’ అని ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ అంతరార్థం ఈ జంట కథ కంచికి చేరినట్టేనని సోషల్ మీడియాలో పోస్ట్లు వైరల్ అయ్యాయి. గత కొంతకాలంగా పాండ్యా, నటాషాలు వ్యక్తిగత ఫొటోలు షేర్ చేయడం లేదు. నటాషా పుట్టిన రోజున కూడా పాండ్యా ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. దాంతో, ఇద్దరి మధ్య దూరం పెరిగిందని, త్వరలోనే విడాకులు తీసుకోవడం ఖాయమని అనుకుంటున్నారంతా. అయితే.. విడాకుల వార్తలపై అటు నటాషాగానీ, ఇటు పాండ్యాగానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

ప్రేమికుల రోజున రెండోసారి
స్పెయిన్ మోడల్ అయిన నటాషాకు, పాండ్యాకు కరోనా సమయం(Corona Time)లోపెళ్లి అయింది. ప్రస్తుతం ఈ జంటకు అగస్త్య(Agastya) అనే పిల్లాడు ఉన్నాడు. అయితే.. హార్దిక్ – నటాషాలు ఈ మధ్యే రెండోసారి వివాహం చేసుకొని వార్తల్లో నిలిచారు. కొడుకు ఉన్నాక మళ్లీ పెండ్లి చేసకోవడానికి కారణం ఎంటో తెలుసా..? 2020 మార్చి 31న అతికొద్ది మంది సమక్షంలో కోర్టులో హార్దిక్, నటాషాల పెళ్లి జరిగింది. అది కరోనా టైమ్ కావడంతో సాదాసీదాగా వీళ్లిద్దరూ మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు.
అయితే… పరిస్థితులు చక్కబడ్డాక బంధు, మిత్రుల ముందు వైభవంగా మనువాడాలని హార్దిక్, నటాషాలు అప్పుడే నిర్ణయించుకున్నారు. అందుకు ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న ముహూర్తం పెట్టుకున్నారు. ఉదయ్పూర్ వేదికగా కన్నులపండువగా వీళ్లు రెండోసారి వివాహం చేసుకున్నారు. తమ కుమారుడు అగస్త్యను ఎత్తుకొని మురిసిపోతూ ఫొటోలు దిగారు. అనుకున్నట్టుగానే తమ పెళ్లిని అందమైన జ్ఞాపకంగా మలచుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

