Weather Report | మరిన్ని ప్రాంతాలకు విస్తరించిన నైరుతిపవనాలు..!
Weather Report | తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఎండలు దంచికొడుతున్నాయి. మళ్లీ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాబోయే ఐదురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Weather Report | తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఎండలు దంచికొడుతున్నాయి. మళ్లీ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాబోయే ఐదురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వానలు పడే సూచనలున్నాయని చెప్పింది.
ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. గడిచిన 24గంటల్లో వనపర్తి, మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైంది. పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. ఇక నైరుతి రుతుపవనాలు నైరుతి బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలో మిగతా ప్రాంతాలకు విస్తరించాయని అమరావతి వాతావరణ విభాగం పేర్కొంది.
రాబోయే 24గంటల్లో నైరుతి బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల మీదుగా ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. ఈస్ట్ సెంట్రల్ బంగాళాఖాతంపై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గత ఆరుగంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో దాదాపు ఉత్తరం వైపుగా కదులుతోందని.. పేర్కొంది. ఉత్తర వైపు కదులుతూ సాయంత్రం నాటికి తూరు మధ్య కదులుతూ ఆదివారం ఉదయం నాటికి తీవ్ర తుఫానుగా మారి అర్ధరాత్రి సాగర్ ద్వీపం, ఖేపుపరా మధ్య బంగ్లాదేశ్, ఆనుకొని పశ్చిమ బెంగాల్ తీరాలను దాటుతుందని పేర్కొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

