Earthquake | ఈశాన్య రాష్ట్రం మేఘాలయ (Meghalaya)ను భూకంపం (Earthquake) వణికించింది. గారో హిల్స్ (North Garo Hills)లో గురువారం ఉదయం 11:32 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.1గా నమోదైంది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. స్వల్ప స్థాయిలోనే ప్రకంపనలు ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. అయితే, ఈ ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, బుధవారం రాత్రి కూడా మేఘాలయలో భూకంపం సంభవించింది. గంటల వ్యవధిలోనే మరోసారి భూకంపం రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.
Also Read..
Emergency Landing | దుబాయ్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య.. నాగ్‌పూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Rekha Gupta | శీష్ మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం : రేఖా గుప్తా
Delhi | రేఖా గుప్తాతోపాటు ప్రమాణం చేయనున్న మంత్రులు వీరే..