Haryana elections | హర్యానా (Haryana) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) పోలింగ్ (Polling) ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ ప్రారంభమైన ఆరు గంటల్లో 36 శాతం మేర ఓటింగ్ నమోదైంది.
మధ్యాహ్నం 1 గంట సమయానికి 36.69 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో 42 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్పారు. మేవాత్‌లో అత్యధికంగా 42.64%, యమునా నగర్లో 42.08%, జింద్‌లో 41.93% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. పంచకులలో అత్యల్పంగా 25.89% ఓటింగ్ నమోదైనట్లు వెల్లడించారు.
36.69% voter turnout recorded till 1 pm in Haryana Assembly elections.
As of 1 pm, Mewat recorded the highest voter turnout of 42.64%, followed by Yamunanagar at 42.08% and Jind at 41.93%. Panchkula recorded the lowest voter turnout at 25.89% pic.twitter.com/xaNXGa0evk
— ANI (@ANI) October 5, 2024
కాగా, రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాల్లో 1031 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వారిలో 101 మంది మహిళలు ఉన్నారు. 2 కోట్లకుపైగా ఓటర్లు ఉండగా వారికోసం 20,629 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. ఈనెల 8న ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read..
Durga Puja | మటన్ బిర్యానీ టు చికెన్ కర్రీ.. బెంగాల్ జైళ్లలో దుర్గా పూజ సందర్భంగా ఖైదీల మెనూ
Bigg Boss 18 | ఫారెస్ట్ థీమ్‌తో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ హౌస్.. వీడియో వైరల్
Bomb Threats | వడోదర, రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్స్‌కు బాంబు బెదిరింపులు