Bigg Boss 18 | ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం.. భాష ఏదైనా ఈ షోకు వీక్షకుల సంఖ్య భారీగానే ఉంటుంది. ఇక హిందీ బిగ్ బాస్ షో రేంజ్ వేరు. ఇప్పటికే 17 సీజన్స్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుని 18వ (Bigg Boss 18) సీజన్‌ను షురూ చేసేందుకు సిద్ధమైంది. ప్రతి సీజన్లోను హిందీ బిగ్ బాస్ హౌస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంటుంది.
Kal aur kaal ki hogi rule book, lekin usse pehle dekhte hai Bigg Boss 18 ke ghar ka first look! 🔥🏠
Watch #BiggBoss18 Grand Premiere 6 October raat 9 baje on @ColorsTV and #JioCinema#BB18 #BiggBoss18onJioCinema #BiggBoss18 #BiggBoss @BeingSalmanKhan pic.twitter.com/ovG3sF9nNO
— JioCinema (@JioCinema) October 5, 2024
అయితే, ఈ సారి గతంతో పోలిస్తే భిన్నంగా బిగ్ బాస్ హౌస్‌ను తీర్చిదిద్దారు మేకర్స్. అదో గుహ, కోట థీమ్‌తో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఇందులో గ్రాండ్ మోటిఫ్‌లు, ప్రత్యేకంగా రూపొందించిన శిల్పాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ వీడియోను చూడగానే.. మాయా ద్వీపం గుర్తొస్తుంది. చాలా ప్రాంతాలు ఫారెస్ట్ వాతావరణాన్ని తలపించేలా ఉన్నాయి. ఈ హౌస్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
BiggBoss18 House Images pic.twitter.com/egLwNUBhIf
— The Khabri (@TheKhabriTweets) October 5, 2024
కాగా, బిగ్ బాస్ హిందీ వర్షన్‌కు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాత. ఇప్పటికే 17 సీజన్స్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ షో 18వ సీజన్ అక్టోబర్ 6న గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోంది. మొత్తం 20 మంది కంటెస్టెంట్స్ ఈ హౌస్‌లోకి వెళ్లనున్నారు.
— The Khabri (@TheKhabriTweets) October 5, 2024
Also Read..
Bomb Threats | వడోదర, రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్స్‌కు బాంబు బెదిరింపులు
Rahul Gandhi | పరువు నష్టం కేసు.. రాహుల్‌కు సమన్లు పంపిన పూణె కోర్టు