Mahindra XUV 700 | దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా పాపులర్ ఎస్యూవీ కార్ల విక్రయంలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. మహీంద్రా బొలెరో, మహీంద్రా థార్, మహీంద్రా స్కార్పియో, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, మహీంద్రా ఎక్స్‌యూవీ 400, మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కార్లను విక్రయిస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా గత నెలలో 51,062 ఎస్యూవీ కార్లు విక్రయించింది. మహీంద్రా అండ్ మహీంద్రా తన మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కార్లను దేశీయంగా 50 వేల పై చిలుకు కార్లను విక్రయించడం 2024 సెప్టెంబర్‌లో తొలిసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్యూవీ కార్లు 2,60,210 యూనిట్లు అమ్ముడయ్యాయి. టాటా నెక్సాన్ 41,063 కార్లు విక్రయించింది.
మహీంద్రా ఎస్యూవీ కార్లు మాత్రమే విక్రయిస్తుంటే.. టాటా మోటార్స్ హ్యాచ్ బ్యాక్, సెడాన్, ఎస్యూవీ కార్లు – టియాగో, టియాగో.ఈవీ, టైగోర్, టైగోర్.ఈవీ, ఆల్ట్రోజ్, పంచ్, పంచ్.ఈవీ, నెక్సాన్, నెక్సాన్.ఈవీ, కర్వ్, కర్వ్.ఈవీ, హారియర్, సఫారీ కార్లను విక్రయిస్తున్నది. ఇంకా హ్యుండాయ్ మోటార్ సైతం వివిధ సెగ్మెంట్లలో గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, ఐ20 ఎన్ లైన్, ఔరా, వెర్నా, ఎక్స్ టర్, వెన్యూ, వెన్యూ ఎన్ లైన్, క్రెటా, క్రెటా ఎన్ లైన్, అల్కాజర్, టస్కన్, ఐయానిక్ 5 ఈవీ కార్లు విక్రయిస్తోంది.