Rahul Gandhi | పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి పూణె ప్రత్యేక కోర్టు (Pune Court) సమన్లు (summoned) జారీ చేసింది. గతేడాది లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ (Vinayak Damodar Savarkar)పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ పూణె కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
ప్రతి సందర్భంలోనూ సావర్కర్‌ను అవమాన పరిచేలా రాహుల్ విమర్శలు చేస్తున్నారని సత్యకి ఆరోపించారు. ఈ కేసు గత నెలలో జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు రాహుల్‌కు సమన్లు పంపింది. అక్టోబర్ 23న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
Also Read..
Encounter | కుప్వారాలో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
Burkina Faso | ఆఫ్రికా దేశంలో మారణహోమం.. గంటల వ్యవధిలోనే 600 మంది ఊచకోత
Donald Trump | ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేయాలి.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ కీలక సూచన