Encounter | జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir)లోని కుప్వారా (Kupwara) జిల్లాలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు (terrorists), భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు టెర్రరిస్ట్‌లు హతమయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్ – పాకిస్థాన్ సరిహద్దుల్లో చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. గుగల్‌ధార్‌లో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించిన బలగాలు.. ఆ ప్రాంతంలో ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకన్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు భారత సైన్యం శనివారం వెల్లడించింది. ఎన్కౌంటర్ జోన్ నుంచి భారీగా ఆయుధాలు గుర్తించినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతున్నట్లు వెల్లడించింది.
Also Read..
Donald Trump | ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేయాలి.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ కీలక సూచన
Burkina Faso | ఆఫ్రికా దేశంలో మారణహోమం.. గంటల వ్యవధిలోనే 600 మంది ఊచకోత
Haryana Elections | కొనసాగుతున్న పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు