Donald Trump | ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేయాలి.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ కీలక సూచన
Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణుస్థావరాలను (Irans nuclear sites) ఇజ్రాయెల్ (Israel) ధ్వంసం చేస్తుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
Donald Trump | ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రత్యక్ష దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఇరు దేశాలు పరస్పరం మిస్సైళ్లు, బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి. దీంతో పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు అలముకున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణుస్థావరాలను (Irans nuclear sites) ఇజ్రాయెల్ (Israel) ధ్వంసం చేస్తుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. నార్త్ కరోలినాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఈ విధంగా వ్యాఖ్యానించారు.
ఇరాన్ అణు కేంద్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుందనే అంశంపై ఇటీవలే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden)ను ఓ విలేకరి ప్రశ్నించగా.. ఆయన స్పందించలేదు. ఈ క్రమంలో బైడెన్ వైఖరిని ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రతీకార దాడులను ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలతో మొదలు పెట్టాలని ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం మొత్తానికి అణ్వాయుధాలతోనే పెను ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ముందుగా ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయాలన్నారు. ఆ తర్వాత మిగతా టార్గెట్లపై ఆలోచించొచ్చన్నారు.
Also Read..
Burkina Faso | ఆఫ్రికా దేశంలో మారణహోమం.. గంటల వ్యవధిలోనే 600 మంది ఊచకోత
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

