Hezbollah Israel War | హెజ్బొల్లా కమ్యూనికేషన్ కమాండర్ హతం.. మరిన్ని సర్ప్రైజ్లు ఉంటాయన్న ఇజ్రాయెల్
హెజ్బొల్లా అధినేత నస్రల్లాను హతమార్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు నస్రల్లా వారసుడిని లక్ష్యంగా చేసుకున్నది. శుక్రవారం ఉదయం లెబనాన్ రాజధాని బీరుట్ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం బయట ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది.
- లెబనాన్‌పై జరిపిన దాడుల్లో 37 మంది మృతి
Hezbollah Israel War | బీరుట్, అక్టోబర్ 4: హెజ్బొల్లా అధినేత నస్రల్లాను హతమార్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు నస్రల్లా వారసుడిని లక్ష్యంగా చేసుకున్నది. శుక్రవారం ఉదయం లెబనాన్ రాజధాని బీరుట్ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం బయట ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. హెజ్బొల్లా సీనియర్ నేత హషేమ్ సఫీద్దీన్ లక్ష్యంగా ఈ దాడి చేసినట్టు తెలుస్తున్నది. నస్రల్లా మరణం తర్వాత హెజ్బొల్లాకు సఫీద్దీన్ నాయకత్వం వహించనున్నట్టు భావిస్తున్నారు. కాగా, హెజ్బొల్లా కమ్యూనికేషన్ విభాగం కమాండర్ మహమ్మద్ రషీద్ సకాఫిని హతమార్చినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) శుక్రవారం ప్రకటించింది. లెబనాన్‌పై తాము జరిపిన దాడుల్లో 37 మంది మృతి చెందారని చెప్పింది.
మరిన్ని సర్ప్రైజ్లు ఉంటాయి: ఇజ్రాయెల్
హెజ్బొల్లాకు మరిన్ని ఊహించని ఘటనలు ఎదురవుతాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గలాంట్ పేర్కొన్నారు. ‘హెజ్బొల్లాకు ఒకదాని తర్వాత ఒకటి తీవ్రమైన ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మేము నస్రల్లాను హతమార్చాం. మా ఆయుధాగారంలో మరిన్ని సర్ప్రైజ్లు ఉన్నాయి. హెజ్బొల్లాకు మరిన్ని ఊహించని ఘటనలు జరగనున్నాయి. కొన్ని ఇప్పటికే చేపట్టాం, ఇంకొన్ని చేపట్టాల్సి ఉంది’ అని గలాంట్ అన్నారు.
హౌతీలపై అమెరికా, బ్రిటన్ దాడి
ఇరాన్ మద్దతున్న హౌతీలపై అమెరికా, బ్రిటన్ శుక్రవారం దాడులు చేశాయి. యెమెన్‌లో ఆయుధ వ్యవస్థలు, స్థావరాలు, ఆయుధ పరికరాలు నిల్వ చేసిన ప్రదేశాలు లక్ష్యంగా వైమానిక, నౌకా దాడులు జరిపినట్టు ఒక అధికారి ధ్రువీకరించారు. కాగా, తమ ప్రధాన పోర్టు సిటీ హొడియాడ ఎయిర్‌పోర్టు, ప్రధాన మిలటరీ బేస్ ఉన్న కతియాబ్ లక్ష్యంగా ఏడు దాడులు జరిగినట్టు హౌతీ తెలిపింది.
టాయ్లెట్లో నిఘా పరికరం
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూపై బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలన ఆరోపణలు చేశారు. తన బాత్రూమ్లో నెతన్యాహూ ఒక నిఘా పరికరాన్ని వదిలిపెట్టి వెళ్లారని ఓ పుస్తకంలో ఆరోపించారు.
ఇజ్రాయెల్ ఎక్కువకాలం ఉండదు: ఖమేనీ
తాజాగా ఇరాన్ చేసిన క్షిపణుల దాడిని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సమర్థించుకున్నారు. ఈ దాడులు న్యాయమైనవని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్‌పై పోరాటం కొనసాగుతుందని, హమాస్, హెజ్బొల్లాకు ఇజ్రాయెల్ తీవ్రమైన హాని తలపెట్టలేదని, యూదుల దేశం(ఇజ్రాయెల్) ఎక్కువ కాలం ఉండదని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

