Durga Puja | దేశంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పలు ఆలయాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో నవరాత్రి ఉత్సవాలను పురష్కరించుకొని పశ్చిమ బెంగాల్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జైళ్లలో (West Bengal jails) శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ప్రత్యేక భోజనాలు (special meals) అందించాలని నిర్ణయించారు. వివిధ కేసుల్లో అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఈ వేడుకల్లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా అన్ని జైళ్లలోని ఖైదీలందరికీ ప్రత్యేక విందు ఏర్పాటు చేయనున్నారు. మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ వంటి పసందైన నాన్ వెజ్ వంటకాలతో మెనూను సిద్ధం చేస్తున్నారు.
‘మేము ప్రతి పండుగ సమయంలోనూ మంచి ఆహారం కోసం ఖైదీల నుంచి అభ్యర్థనలను స్వీకరిస్తాం. ఈ సారి కొత్త మెనూ అందింది. ఇది వారి (ఖైదీల) ముఖాల్లో చిరునవ్వు తెస్తుందని ఆశిస్తున్నాము’ అని ఓ అధికారి తెలిపారు. ఖైదీల మతపరమైన భావాలను గౌరవిస్తూ అందరికీ నాన్‌వెజ్ అందించబోమని చెప్పారు. ఖైదీలు తమకు నచ్చిన ఆహారాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 59 జైళ్లు ఉన్నాయి. అందులో 26,994 మంది పురుషులు, 1,778 మంది మహిళలు ఉన్నారు. దుర్గా పూజ (Durga Puja) మెనూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్లలో అక్టోబర్ 9 నుంచి 12 వరకూ ఉంటుందని అధికారులు తెలిపారు.
Also Read..
Bigg Boss 18 | ఫారెస్ట్ థీమ్‌తో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ హౌస్.. వీడియో వైరల్
Bomb Threats | వడోదర, రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్స్‌కు బాంబు బెదిరింపులు
Rahul Gandhi | పరువు నష్టం కేసు.. రాహుల్‌కు సమన్లు పంపిన పూణె కోర్టు