Sudan Crisis | ఆఫ్రికా దేశం సుడాన్ (Sudan) అల్లర్లతో అట్టుడుకుతోంది. ఆర్మీ, శక్తివంతమైన పారామిలిటరీ బలగాల మధ్య మూడు రోజులుగా ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. 1800 మందికిపైగా ప్రజలు ఆసుపత్రి పాలయ్యారు. కాగా, ఈ ఘర్షణ వాతావరణంలో పలువురు భారతీయులు ఆ దేశంలో చిక్కుకుపోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.
కర్ణాటక (Karnataka) రాష్ట్రానికి చెందిన సుమారు 31 మంది సుడాన్లో చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు. చిక్కుకున్న వారి కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs)కు సమాచారం అందించినట్లు కర్ణాటక రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (Karnataka State Disaster Management Authority) తెలిపింది. ఈ మేరకు రెస్క్యూ ప్రక్రియను వేగవంతం చేయడానికి సుడాన్లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.
‘కర్ణాటకకు చెందిన 31 మంది వ్యక్తులు సుడాన్లో చిక్కుకుపోయారని మాకు సమాచారం వచ్చింది. ఈ విషయాన్ని మేము విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs)కు తెలియజేశాం. సుడాన్లోని భారత రాయబార కార్యాలయం సూచనలను పాటించాల్సిందిగా ఆ బృందాన్ని కోరాం. చిక్కుకుపోయిన వారు ఎక్కడున్నారో అక్కడే ఉండాలి, బయటికి వెళ్లకూడదని హెచ్చరించాం’ అని కర్ణాటక రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ కమిషనర్ డాక్టర్ మనోజ్ రాజన్ తెలిపారు.
మరోవైపు సుడాన్లో చిక్కుకుపోయిన వారిని రక్షించాలని కాంగ్రెస్ నేత (Congress Leader) , కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. హోం శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులు సురక్షితంగా తిరిగి భారత్ చేరుకునేలా చూడాలన్నారు. ‘కర్ణాటకకు చెందిన హక్కీ పిక్కీ తెగకు చెందిన 31 మంది సుడాన్లో చిక్కుకుపోయినట్లు సమాచారం. వారిని తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం ఇంకా చర్యలు ప్రారంభించలేదు. ప్రభుత్వం తక్షణమే దౌత్యపరమైన చర్చలు ప్రారంభించి వారు సురక్షితంగా భారత్కు తిరిగి వచ్చేలా చూడాలని నేను కోరుతున్నా’ అంటూ సిద్ధరామయ్య ట్విట్టర్ ద్వారా కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
It is reported that 31 people from Karnataka belonging to Hakki Pikki tribe, are stranded in Sudan which is troubled by civil war.
I urge @PMOIndia @narendramodi, @HMOIndia, @MEAIndia and @BSBommai to immediately intervene & ensure their safe return.
— Siddaramaiah (@siddaramaiah) April 18, 2023
It is also unfortunate to know that we have lost one Indian & 60 others in the ongoing civil war in Sudan.
My deepest condolences to their families and pray for the peace in the region.
— Siddaramaiah (@siddaramaiah) April 18, 2023
Also Read..
Sudan Crisis | ఘర్షణలతో దద్దరిల్లుతున్న సుడాన్.. 200 మంది మృతి.. 1,800 మందికి గాయాలు
NewBorn Baby | చెత్త కుప్పలో దొరికిన శిశువుకు సగం ఆస్తి.. పెద్ద మనసు చాటుకున్న మహిళ