Heatwave Alert | దేశవ్యాప్తంగా భానుడి భగభగలు.. పలు రాష్ట్రాలకు హీట్‌వేవ్స్ హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ
Heatwave Alert | దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత (Heat Wave) పెరిగింది. పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు (IMD) జారీ చేసింది.
Heatwave Alert | దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత (Heat Wave) పెరిగింది. పలు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకి రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఉష్ణతాపానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు (IMD) జారీ చేసింది. ఎండ తీవ్రతతోపాటు వేడిగాలులు వీస్తాయని తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజుల పాటు వేడి గాలులు వీస్తాయని ఐఎండీ (IMD) తెలిపింది. ఏప్రిల్ 18, 19 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లో హీట్ వేవ్ పరిస్థితులు నెలకొంటాయని అంచనా వేసింది. ఇక సిక్కిం, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో రానున్న రెండు మూడు రోజులు వేడిగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)తో పాటు దాని దక్షిణ కోస్తా ప్రాంతాల్లో బుధవారం వరకు వేడిగాలులు (Heat Wave) వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలకు హీట్ వేవ్ హెచ్చరికలను ఐఎండీ జారీ చేసింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలు,రాయలసీమ ప్రాంతంలో 38 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
మరోవైపు ఢిల్లీలోనూ హీట్ వేవ్ పరిస్థితులు వరుసగా రెండో రోజు కొనసాగాయి. కొన్ని వాతావరణ స్టేషన్లలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కనీసం ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగానే నమోదయ్యాయి. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే నాలుగు డిగ్రీలు ఎక్కువ. దేశ రాజధానిలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదవడం ఇది వరుసగా మూడో రోజు.
పంజాబ్, హర్యానాలలో కూడా వేడి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. హర్యానాలో 41.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో వేడిగాలులు వ్యాపించాయి. రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని ఛండీగఢ్‌లో వేడి తీవ్రత అత్యధికంగా 40 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రాజస్థాన్‌లోని చురులో అత్యధికంగా 42.2 డిగ్రీల సెల్సియస్, బన్స్వారాలో 42.1 డిగ్రీలు, కరౌలీలో 41.4 డిగ్రీలు, అల్వార్‌లో 41.9 డిగ్రీలు, కోటాలో 41.2 డిగ్రీలు, పిలానీలో 41.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐంఎడీ వెల్లడించింది.
Also Read..
Rice Mill Building Collapses | హర్యానాలో విషాదం.. రైస్ మిల్ భవనం కూలి నలుగురు మృతి
Sudan Crisis | ఘర్షణలతో దద్దరిల్లుతున్న సుడాన్.. 200 మంది మృతి.. 1,800 మందికి గాయాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
Daler Mehndi | దలేర్ మెహందీ వివాదంపై పీఎం మోదీకి FWICE లేఖ.. కళాకారుల పట్ల సంయమనం పాటించాలని విజ్ఞప్తి!
Sheetal Devi: ఆర్చరీలో శీతల్ దేవి అద్భుతం.. పారా గేమ్స్‌లో రెండో స్వర్ణం
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

