Apple BKC | ఐఫోన్ల ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. భారత్‌లో తొలి అధికారిక ‘యాపిల్ బీకేసీ’ (Apple BKC) రిటైల్ స్టోర్ (retail store) మంగళవారం ముంబైలో ఘనంగా ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు యాపిల్ సీఈవో (Apple CEO) టిమ్ కుక్ (Tim Cook) తమ తొలి రిటైల్ స్టోర్‌ను ఘనంగా లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా స్టోర్ గేట్లు ఓపెన్ చేసి కస్టమర్లకు కుక్ సాదర స్వాగతం పలికారు.
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్ (Jio World Drive Mall)లో ఈ స్టోర్ ఉంది. సుమారు 22,000 చదరపు విస్తీర్ణంలో ఈ స్టోర్‌ను ఏర్పాటు చేశారు. లాస్ఎంజెల్స్, న్యూయార్క్, బీజింగ్, మిలాన్, సింగ్‌పూర్ వంటి నగరాల తర్వాత ముంబైలోనే యాపిల్ ఐ-ఫోన్ తొలి రిటైల్ స్టోర్‌ను వినియోగదారులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
కాగా, దేశీయ మొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టి 25 ఏండ్లు పూర్తిచేసుకున్న యాపిల్ సంస్థ.. దేశీయ మార్కెట్లో మరింత పట్టు సాధించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక స్టోర్లను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. భారత్‌లో సంస్కృతితోపాటు అద్భుతమైన శక్తిదాగివుందని, కస్టమర్టకు దీర్ఘకాలికంగా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు యాపిల్ సీఈవో టిమ్ కుక్ పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి 5 బిలియన్ డాలర్ల విలువైన మొబైళ్లు విదేశాలకు యాపిల్ ఎగుమతయ్యాయని చెప్పారు.
ఇక ముంబై తర్వాత రెండు రోజులకే దేశ రాజధాని న్యూఢిల్లీ (New Delhi)లోనూ రెండో యాపిల్ రిటైల్ స్టోర్‌ను సంస్థ లాంఛ్ చేయనుంది. ఢిల్లీ సాకెట్లోని సెలెక్ట్ సిటీవాక్ మాల్లో ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10 గంటలకు యాపిల్ రిటైల్ స్టోర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు టెక్ దిగ్గజం ఇప్పటికే స్పష్టం చేసింది. ముంబై యాపిల్ స్టోర్ మాదిరిగానే ఢిల్లీ రిటైల్ స్టోర్ సైతం దాదాపు 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది.
#WATCH | Apple CEO Tim Cook opens the gates to India's first Apple store at Mumbai's Bandra Kurla Complex pic.twitter.com/MCMzspFrvp
— ANI (@ANI) April 18, 2023
Also Read..
Sudan Crisis | ఘర్షణలతో దద్దరిల్లుతున్న సుడాన్.. 200 మంది మృతి.. 1,800 మందికి గాయాలు
India Corona | కొత్త కేసుల్లో తగ్గుదల.. 61 వేల మార్క్‌ను దాటిన యాక్టివ్ కేసులు
Virat Kohli: విరాట్ కోహ్లీకి ఫైన్.. మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత