NewBorn Baby | చెత్త కుప్పలో దొరికిన శిశువుకు సగం ఆస్తి.. పెద్ద మనసు చాటుకున్న మహిళ
NewBorn Baby | మానవత్వం మరచిన ఓ మహిళ పేగు తెంచుకు పుట్టిన శిశువును చెత్త కుప్ప (Garbage) లో పడేసింది. ఆ తల్లికి భారమైన ఆ చిన్నారిని మరో మహిళ అక్కున చేర్చుకుని తన పెద్ద మనసు చాటుకుంది.
NewBorn Baby | మానవత్వం మరచిన ఓ మహిళ పేగు తెంచుకు పుట్టిన శిశువును చెత్త కుప్ప (Garbage) లో పడేసింది. ఆ తల్లికి భారమైన ఆ చిన్నారిని మరో మహిళ అక్కున చేర్చుకుని తన పెద్ద మనసు చాటుకుంది. చెత్తకుప్పలో దొరికిన ఆ చిన్నారిని చేరదీయడమే కాకుండా.. తన ఆస్తిలోని సగం వాటాను చిన్నారి పేరుమీద రాసేందుకు ముందుకొచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని అలీగఢ్ (Aligarh)లో చోటు చేసుకుంది.
స్థానిక స్వర్ణజయంతి నగర్ (Swarna Jayanti Nagar) లో నివాసం ఉండే జయప్రకాశ్ భార్య లత (Lata) సోమవారం సాయంత్రం పాల కోసం బయటకు వెళ్లింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఎంప్లాయిస్ కాలనీలోని ఖాళీ స్థలంలో ఉన్న ఓ చెత్త కుప్పలో నుంచి చిన్నారి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా లతకు ఓ నవజాతశిశువు (NewBorn Baby ) కనిపించింది. వెంటనే ఆ చిన్నారిని చేతుల్లోకి తీసుకుని.. శిశువు గురించి చుట్టుపక్కల వారిని ఆరా తీసింది.
ఆ బిడ్డ ఎవరో తమకు తెలియదని స్థానికులు తెలపడంతో ఆ శిశువును ఇంటికి తీసుకెళ్లింది. చిన్నారి ఆలనాపాలనా చూసుకుంది. అనంతరం ఆ బిడ్డను దత్తత తీసుకుని.. తన పేరుమీద ఉన్న ఆస్తిలో సగం వాటాను చిన్నారి పేరుపై రాయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్న కాలనీ వాసులు లత పెద్ద మనసును అభినందించారు. చిన్నారి విషయం పోలీసులకు తెలియడంతో వారు చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించారు.
Also Read..
Elon Musk | చాట్‌జీపీటీకి పోటీగా మస్క్ ఏఐ చాట్‌బాట్.. ప్రకటించిన బిలియనీర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

