Rishi Sunak | అక్షతా మూర్తి ( Akshata Murty)ని అడ్డుపెట్టకుని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak ) ను ప్రతిపక్షాలు (Opposition parties) మరోసారి టార్గెట్ చేశాయి. అక్షత వ్యాపారాలకు సంబంధించి సునాక్‌పై ప్రతిపక్ష నేతలు గతంలో అనేకసార్లు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి పరిస్థితే సునాక్‌కు ఎదురైంది. అయితే ఈ సారి ఆయన పార్లమెంటరీ విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. అక్షతా మూర్తికి సంబంధించిన వ్యాపారానికి ప్రయోజనం కలిగించే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశారని సునాక్‌పై ఆరోపణలు ఉన్నాయి.
పిల్లల సంరక్షణ (childcare firm )కు సంబంధించి ‘కోరు కిడ్స్ లిమిటెడ్’ (Koru Kids) అనే సంస్థలో అక్షితకు వాటాలు ఉన్నాయి. కాగా, రిషి సునాక్ ప్రభుత్వం మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఓ పైలట్ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద ఇలాంటి సంస్థల నిర్వాహకులకు రాయితీలు అందుతాయి. అయితే ప్రధాని రిషి సునాక్ తన భార్య కంపెనీని దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకువచ్చారంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. దీనిపై దర్యాప్తు జరపాలని ప్రతిపక్ష లిబరల్ డెమొక్రాట్లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ కమిషనర్ ఫర్ స్టాండర్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్ స్వతంత్ర అధికారి డేనియల్ గ్రీన్ బర్గ్ (Daniel Greenberg) దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Sudan Crisis | ఘర్షణలతో దద్దరిల్లుతున్న సుడాన్.. 200 మంది మృతి.. 1,800 మందికి గాయాలు
India Corona | కొత్త కేసుల్లో తగ్గుదల.. 61 వేల మార్క్‌ను దాటిన యాక్టివ్ కేసులు