బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్లో పదవుల పందేరం మరోసారి తెరపైకి వచ్చింది. మంత్రి పదవుల కోసం సుమారు 30 మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఢిల్లీ బాటపట్టారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టేలా సీఎం సిద్దరామయ్యపై అధిష్టానం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. (Karnataka Congress MLAs) తమకు మంత్రి పదవులు దక్కకపోవడంపై సుమారు 30 మంది సీనియర్ శాసనసభ్యులు ఆవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లైనా తమకు అవకావం ఇవ్వడం లేదని వారు ఆరోపించారు.
కాగా, ఇటీవలి ఉప ఎన్నికల తర్వాత కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసం డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో సుమారు 25 మంది సీనియర్ ఎమ్మెల్యేలు మార్చిలో రహస్యంగా విందు సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రివర్గంలో అవకాశాల కోసం పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవాలని సమిష్టిగా నిర్ణయించారు.
మరోవైపు వ్యూహత్మక కార్యాచరణ అమలు చేసేందుకు కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. సుమారు 30 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ బాటపట్టారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలవాలని ఈ బృందం యోచిస్తున్నది. అలాగే అవకాశాన్ని బట్టి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా వంటి సీనియర్ నాయకులను కూడా కలిసేందుకు ప్రయత్నిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే అశోక్ పట్టన్ తెలిపారు. కేబినెట్ విస్తరణ కోసమే తమ పర్యటన అని, వేరే అజెండా ఏమీ లేదని స్పష్టం చేశారు.
Also Read:
167 children rescued | 167 మంది పిల్లలను పని కోసం రైలులో తరలింపు.. రక్షించిన పోలీసులు